సాక్షి, ఉంగుటూరు: కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తేలప్రోలు గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపులో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. గ్రామంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. దీంతో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య తోపులాట, ఘర్షణ చోటుచేసుకున్నాయి. ఘర్షణలో టీడీపీ వర్గం రాళ్లు రువ్వింది. దీంతో ఆత్కూరు ఎస్సై శ్రీనివాసరావుతోపాటు ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. టీడీపీ శ్రేణుల దాడులపై వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రెచ్చిపోయిన పచ్చపార్టీ నేతలు..
Sep 15 2019 8:21 AM | Updated on Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement