'మహా నాయకుడు' టిక్కెట్లు ఫ్రీ | TDP Leaders Distribute Mahanayakudu Movie Tickets | Sakshi
Sakshi News home page

'మహా నాయకుడు' టిక్కెట్లు ఫ్రీ

Feb 28 2019 3:21 PM | Updated on Mar 22 2024 11:16 AM

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన 'మహా నాయకుడు' సినిమాను ప్రమోట్‌ చేసేందుకు టీడీపీ నాయకులు తంటాలు పడుతున్నారు. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని సాక్షాత్తూ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో అధికార పార్టీ నాయకులకు తిప్పలు తప్పడం లేదు. అధినేత ఆదేశాలను శిరసావహించేందుకు టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో వారిని ధియేటర్లకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జుల ద్వారా ఉచితంగా టికెట్లు పంపిణీ చేసి ప్రేక్షకులను ప్రసన్నం చేసుకుంటున్నారు.

Advertisement

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
Advertisement