రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించి సోమవారం నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో.. అమరావతిలో అలజడి సృష్టించేందుకు అసాంఘిక శక్తులు కుట్రలకు పాల్పడుతున్నాయి. జేఏసీ ముసుగులో కుట్రలకు పన్నాగం చేస్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు కొన్ని పార్టీలు రాజధాని గ్రామాల్లోకి ఇతర ప్రాంతాలవారిని రప్పిస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అల్లర్లకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చేటప్పుడు వారిపై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రాళ్ల దాడులు, భౌతిక దాడులకు తెగబడేలా వారికి టీడీపీ డైరెక్షన్స్ ఇస్తున్నట్టుగా సమాచారం.
అమరావతిలో అలజడికి కుట్రలు..
Jan 19 2020 7:38 PM | Updated on Jan 19 2020 7:57 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement