స్పా అండ్ బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఎనిమిది మందిని చందానగర్ ఎస్‌ఓటీ పోలీసులు బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. గంగారంలోని సన్‌షైన్ స్పా అండ్ బ్యూటీపార్లర్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడిలో నలుగురు యువకులు, నలుగురు యువతులు పట్టుపడ్డారు. వారి నుంచి రూ.15 వేల నగదు, 8 మొబైల్ ఫాన్లను స్వాధీనం చేసుకున్నారు