మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలకమైన బలపరీక్షకు సిద్ధమయ్యారు. అధికార విపక్షాల నిరసనలు, నినాదాల మధ్య అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ముందుగా సభలో ప్రసంగం ప్రారంభించిన బీజేపీ శాసనసభపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు వర్షం కురిపించారు. గవర్నర్ ఆదేశాల మేరకు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన కాళిదాస్ కొలంబకర్‌ను నియమించారని.. ఉద్ధవ్ ప్రభుత్వం కాళిదాసును తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.
మహా బలపరీక్ష: బీజేపీ వాకౌట్
Nov 30 2019 3:31 PM | Updated on Nov 30 2019 3:37 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement