చంద్రబాబు నాయుడు అబద్ధాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. వరదలపై చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తప్పుల తడక అని ఆయన ధ్వజమెత్తారు. మంత్రి అనిల్ కుమార్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు బుదర రాజకీయాలు చేస్తున్నారని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి నీటిని ఎలా వదులుతారో తెలియదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత చెబుతున్నట్లు వరద నీటిని వదిలేసి ఉంటే ఇవాళ డ్యాముల్లో నీరు ఉండేది కాదన్నారు. వరద నీటిని కిందకు వదిలి ఉంటే రాయలసీమకు నీరు ఎలా ఇస్తామని, ఈ మాత్రం అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు బుదర రాజకీయాలు చేస్తున్నారు
Aug 24 2019 4:46 PM | Updated on Aug 24 2019 5:10 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement