కోడలిని కూతురిలా చూసుకోవాల్సిన ఓ మామ కుమారుడి వివాహ రిసెప్షన్‌లో చేసిన వికృత చేష్టపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతడికి బుద్ధి జ్ఞానం లేదా, వావి వరుసలు లేవా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన ఇటీవల చైనాలో చోటుచేసుకుంది.తూర్పు చైనా జియాంగ్జౌ ప్రావిన్స్‌లో ఇటీవల ఓ యువ జంట వివాహం చేసుకుంది. యాంచెంగ్‌లోని వుజౌ అంతర్జాతీయ ఫంక్షన్ హాలులో రిసెప్షన్ నిర్వహించారు. వరుడి తండ్రి తన కొత్త కోడలంటూ అందరికీ కుమారుడి భార్యను పరిచయం చేస్తున్నాడు. అంతలోనే ఏమైందో తెలియదు కానీ, కుమారుడు, బంధువుల ఎదుటే కొత్త కోడలితో వికృతంగా ప్రవర్తించాడు. బలవంతంగా ఆమెను పట్టుకుని పెదాలను ముద్దాడాడు. ఆమె వద్దూ అంటూ దూరం జరుపుతున్నా ఆ పెద్దాయన మాత్రం విచిత్రంగా ప్రవర్తించాడు. దీంతో వధువు బంధువులు, స్నేహితులు వరుడి కుటుంబంతో గొడవకు దిగారు.
కోడలిపై మామ వికృతచర్య
Mar 2 2018 1:10 PM | Updated on Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement