ఉద్యోగులు, వ్యాపారులు కలిసి కుమ్మక్కై చేసిన క్యాష్‌బ్యాక్ మోసం పరిమాణం దాదాపు రూ. 10 కోట్లు ఉంటుందని తమ అంతర్గత విచారణలో తేలినట్లు చెల్లింపుల సేవల సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఈ మోసం బైటపడిన నేపథ్యంలో వందల కొద్దీ విక్రేతలను తమ ప్లాట్‌ఫాం నుంచి తొలగించడంతో పాటు పలువురు ఉద్యోగులను తప్పించినట్లు వివరించారు. ‘దీపావళి తర్వాత కొంత మంది విక్రేతలకు పెద్ద ఎత్తున క్యాష్‌బ్యాక్ లభిస్తుండటాన్ని మా టీమ్ గుర్తించింది.