దేశీయ స్టాకమార్కెట్లు తీవ్ర కరెక్షన్‌కు గురయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నప్పటికీ దేశీయంగా అమ్మకాల ఒత్తిడినెదురొన్నాయి. మిడ్ సెషన్‌నుంచి ఊపందుకున్న అమ్మకాలు చివరి వరకూ కొనసాగాయి. చివరికి సెన్సెక్స్ 369 పాయింట్లు పతనమై 35656 వద్ద, నిఫ్టీ 119 పాయింట్లు క్షీణించి 1066ల వద్ద స్థిరపడ్డాయి. తద్వారా కీలక మద్దతు స్థాయిలకు ఎగవన స్థిరంగా నిలబడలేక పోయాయి.