టీడీపీకి జాతీయ పార్టీగా ఎదిగే సత్తా ఉంది | tdp-will-become-national-party-says-chandrababu-naidu | Sakshi
Sakshi News home page

Nov 20 2014 1:34 PM | Updated on Mar 22 2024 11:06 AM

తెలంగాణ సర్కారు టీడీపీని దెబ్బతీయడమే పనిగా పెట్టుకుందని ఏపీ సీఎం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. గురువారం విజయవాడలో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ... టీడీపీకి జాతీయ పార్టీగా ఎదిగే సత్తా ఉందని జోస్యం చెప్పారు. రాష్ట్ర విభజనపై తనది రెండు కళ్ల సిద్ధాంతమంటూ అందరు తనను విమర్శించారని... కానీ ప్రజలు ఆశీర్వదించారని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు మరో ఆరు నెలల సమయం పడుతుందని చంద్రబాబు వెల్లడించారు. విజయవాడలో జరగుతున్న ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ క చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement