చంచల్గూడ నుంచి చర్లపల్లికి.. | TDP MLA Revanth Reddy Chanchalguda jail to cherlapally jail | Sakshi
Sakshi News home page

Jun 2 2015 12:16 PM | Updated on Mar 20 2024 1:44 PM

ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చంచల్గూడ జైలు నుంచి చర్లపల్లి జైలుకు తరలించేందుకు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండులో ఉన్న ఆయనను చర్లపల్లి జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టులో అధికారులు రిక్విజేషన్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. మరోవైపు రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈనెల 5వ తేదీకి వాయిదా పడింది. శుక్రవారం కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీ అధికారులను కోర్టు ఆదేశించారు. కాగా రాజకీయంగా కుట్రచేసి రేవంత్‌ను ఇరికించారని ఆయన తరపున లాయర్లు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement