హోదా తాకట్టుకు దక్కిన తొలి ‘ప్యాకేజీ’ | Sakshi
Sakshi News home page

హోదా తాకట్టుకు దక్కిన తొలి ‘ప్యాకేజీ’

Published Tue, Sep 13 2016 10:40 AM

కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను అప్పగించి 24 గంటలు కూడా గడవక ముందే.. ఆ ప్రాజెక్టు హెడ్‌వర్క్స్(ప్రధాన పనులు) కాంట్రాక్టర్ అయిన టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు ఏపీ ప్రభుత్వం రూ.1,481 కోట్ల భారీ లబ్ధి చేకూర్చింది. కేంద్రమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకుంటే కమీషన్లు కొట్టేసే అవకాశం ఉండదని, అందుకే చంద్రబాబు సర్కారు ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపిందనడానికి ఇదొక నిదర్శనం. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం(7న) రాత్రి ప్యాకేజీ ప్రకటించగానే.. గురువారం(8న) పోలవరం హెడ్‌వర్క్స్ అంచనా వ్యయాన్ని రూ.5,535.41 కోట్లకు పెం చుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు(జీవో 96) జారీ చేసింది.

Advertisement
Advertisement