బీహార్ ఎన్నికలకు నగారా మోగింది. ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ ఈ వివరాలు ప్రకటించారు. మొత్తం 5 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి దశ ఎన్నిక అక్టోబర్ 12న మొదలవుతుంది. ఫలితాలను నవంబర్ 8వ తేదీన ప్రకటిస్తారు.