breaking news
nasim jaidi
-
ఈసీఐఎల్‌ను సందర్శించిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)ను కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీమ్ జైదీ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ భన్వర్‌లాల్‌తో కలసి శనివారం సందర్శించారు. వచ్చే నెలలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఆయన ఈసీఐఎల్‌ను సందర్శించినట్లు సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణల నేపథ్యంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సంస్థ ప్రతినిధులకు సూచించినట్లు తెలిపారు. -
బీహార్ ఎన్నికలకు మోగిన నగారా
-
బీహార్ ఎన్నికలకు మోగిన నగారా
బీహార్ ఎన్నికలకు నగారా మోగింది. ఆ రాష్ట్రంలో ఉన్న మొత్తం 243 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీం జైదీ ఈ వివరాలు ప్రకటించారు. మొత్తం 5 విడతల్లో ఎన్నికలు జరుగుతాయి. తొలి దశ ఎన్నిక అక్టోబర్ 12న మొదలవుతుంది. ఫలితాలను నవంబర్ 8వ తేదీన ప్రకటిస్తారు. తొలి దశకు నోటిఫికేషన్ తేదీ - 16 సెప్టెంబర్ నామినేషన్లకు చివరితేదీ - 23 సెప్టెంబర్ నామినేషన్ల పరిశీలన 24 సెప్టెంబర్ ఉపసంహరణకు చివరితేదీ 26 సెప్టెంబర్ ఎన్నికల తేదీ 12 అక్టోబర్ మొత్తం స్థానాలు 49 రెండో దశకు నోటిఫికేషన్ తేదీ - 21 సెప్టెంబర్ నామినేషన్లకు చివరితేదీ - 28 సెప్టెంబర్ నామినేషన్ల పరిశీలన 29 సెప్టెంబర్ ఉపసంహరణకు చివరితేదీ 1 అక్టోబర్ ఎన్నికల తేదీ 16 అక్టోబర్ మొత్తం స్థానాలు 32 మూడోదశకు నోటిఫికేషన్ తేదీ - 1 అక్టోబర్ నామినేషన్లకు చివరితేదీ - 8 అక్టోబర్ నామినేషన్ల పరిశీలన 9 అక్టోబర్ ఉపసంహరణకు చివరితేదీ 12 అక్టోబర్ ఎన్నికల తేదీ 20 అక్టోబర్ మొత్తం స్థానాలు 50 నాలుగో దశకు నోటిఫికేషన్ తేదీ - 7 అక్టోబర్ నామినేషన్లకు చివరితేదీ - 14 అక్టోబర్ నామినేషన్ల పరిశీలన 15 అక్టోబర్ ఉపసంహరణకు చివరితేదీ 17 అక్టోబర్ ఎన్నికల తేదీ 1 నవంబర్ మొత్తం స్థానాలు 55 ఐదో దశకు నోటిఫికేషన్ తేదీ - 8 అక్టోబర్ నామినేషన్లకు చివరితేదీ - 15 అక్టోబర్ నామినేషన్ల పరిశీలన 17 అక్టోబర్ ఉపసంహరణకు చివరితేదీ 19 అక్టోబర్ ఎన్నికల తేదీ 5 నవంబర్ మొత్తం స్థానాలు 57 ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన 8 నవంబర్ మొత్తం ప్రక్రియ ముగింపు 12 నవంబర్ జైదీ చెప్పిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి... 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 6.6 కోట్ల మంది ఓటర్లు, నవంబర్ 29తో అసెంబ్లీ గడువు ముగుస్తుంది. కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరిస్తాం సంఘవ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం లైసెన్సుడు ఆయుధాలను తప్పనిసరిగా స్టేషన్లలో డిపాజిట్ చేయాలి డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ, పెయిడ్ న్యూస్ తదితర అంశాలపై దృష్టిపెడతాం 47 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాం మొత్తం 38 జిల్లాలుండగా వాటిలో 34 జిల్లాల్లో సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. పోలింగ్ కేంద్రాలు అన్నింటివద్ద తాగునీరు, టాయిలెట్ల లాంటి సదుపాయాలు తప్పనిసరిగా ఏర్పాటుచేస్తాం ఓటర్లకు ఫొటో ఓటరు కార్డులు, ఓటరు స్లిప్పులు ముందుగానే అందిస్తాం. తద్వారా వాళ్లకు ఓటు వేయాలన్న ఆహ్వానం అందినట్లవుతుంది ఈవీఎంలలో కూడా గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటోలు తప్పనిసరిగా ఉండాలి ఒపీనియన్ పోల్స్‌ను, ప్రకటనలను ఎన్నికకు 48 గంటల ముందు నుంచి నిషేధిస్తున్నాం ఎన్నికల కోడ్ తక్షణం అమలులోకి వస్తుంది. రాజకీయ పార్టీలు, ఇతర స్టేక్ హోల్డర్లు అందరూ ఈ కోడ్‌ను పక్కాగా అమలుచేయడానికి సహకరించాలి. ఈ ఎన్నికల్లో లాలు ప్రసాద్‌కు చెందిన ఆర్జేడీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) కూటమిగా కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపీ, సమాజ్ వాదీ పార్టీ మాత్రం విడివిడిగా పోటీ చేయనున్నాయి. బీహార్ అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాలు ఇవీ.. జేడీయూ 110 బీజేపీ 91 ఆర్జేడీ 25 కాంగ్రెస్ 5 ఇతరులు 6 మొత్తం స్థానాలు 243