కమ్మిన కరువు మేఘం! | Drought Cloud-capped ! | Sakshi
Sakshi News home page

Oct 18 2016 7:27 AM | Updated on Mar 21 2024 8:18 PM

రాష్ట్రంలో కరువు రక్కసి కరాళ నృత్యం చేస్తోంది. కరువునే భయటపెడదాం, అది మనల్ని చూసి పారిపోవాలి అంటూ సీఎం చంద్రబాబు చేస్తున్న హెచ్చరికలు ఫలితాన్నివ్వడం లేదు. ఖరీఫ్‌ను మింగేసిన క్షామం రబీని కూడా పట్టిపీడిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరువు తీవ్రత కలవరపరుస్తోంది. రాష్ట్రంలోని పది జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ సీజన్‌లో (జూన్1 నుంచి అక్టోబరు 15 వరకూ) నెల్లూరు జిల్లాలో 60.3 శాతం లోటు వర్షపాతం నమోదైంది. (50 ఏళ్ల వర్షపాత వివరాలను క్రోడీకరించి సగటు వర్షపాతాన్ని సాధారణ వర్షపాతంగా నిర్ణయిస్తారు) దీంతో నెల్లూరును వాతావరణ శాఖ పెను కరువు జిల్లాల జాబితాలో చేర్చింది.

Advertisement
 
Advertisement
Advertisement