‘ఓటుకు నోటు’ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దానినుంచి బయటపడటం కోసం ఉన్న మార్గాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యేకు డబ్బు ఎరగా చూపిస్తూ రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన రోజునుంచి... మరీ ముఖ్యంగా తాను మాట్లాడిన ఆడియో టేపులు బయటకుపొక్కినప్పటి నుంచి ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తూ... ఏం చేస్తే బయటపడగలుగుతామని అధికారులను ఆరా తీస్తున్నారు. వీడియో టేపుల్లో రేవంత్‌రెడ్డి చెప్పిన ‘బాస్’ స్థానంలో తాను కాకుండా మరొకరిని ప్రవేశపెడితే చట్టపరంగా ఎలా ఉంటుందని కూడా ఆయన ఆరా తీసినట్టు అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం.