గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రికి ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్గజపతిరాజు వెల్లడించారు. ఆదివారం తిరుమలలో కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామిని అశోక్గజపతి రాజు దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల విలేకర్లతో అశోక్ మాట్లాడారు. తిరుపతిని నో ఫ్లైజోన్గా ప్రకటించాలని కేంద్రం సిఫార్స్ చేసిందని తెలిపారు.