తొమ్మిది మంది ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆమోస్, రాజలింగం, భానుప్రసాద్, జగదీశ్వర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, సలీం, పిఆర్టియు ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్ధన్ రెడ్డి, బిఎస్పీ ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్పలు టిఆర్ఎస్ కార్యాలయానికి వచ్చి ఆ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భానుప్రసాద్ ప్రసాద్ మాట్లాడుతూ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చేందుకు ఎంతో కృషి చేశారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసమే తాము టిఆర్ఎస్లో చేరినట్లు చెప్పారు.