పదవి కోసం రచ్చకెక్కిన తమ్ముళ్లు | - | Sakshi
Sakshi News home page

పదవి కోసం రచ్చకెక్కిన తమ్ముళ్లు

Nov 25 2026 2:30 AM | Updated on Nov 25 2026 2:30 AM

రాజంపేట : పురపాలక సంఘం వైస్‌ చైర్మన్‌ పదవి కోసం రాజంపేట తెలుగు తమ్ముళ్లు రచ్చకెక్కారు. తన కుమార్తె దొంతం గాయత్రిని చైర్‌పర్సన్‌గా ఏకగ్రీవం చేసుకొని, తాను వైస్‌చైర్మన్‌ పీఠం అధిరోహించాలనే యోచనతో కౌన్సిలర్‌ దొంతం శివ చేసిన వ్యూహం బెడిసికొట్టింది. మంగళవారం వైస్‌చైర్మన్‌ ఎంపిక ఎన్నిక నిర్వహించేందుకు సబ్‌కలెక్టర్‌ భావన సన్నద్ధమయ్యారు. టీడీపీ హైకమాండ్‌ వైస్‌ చైర్మన్‌ పదవిని 9వ వార్డు కౌన్సిలర్‌ షబ్రీన్‌నూర్‌కు కేటాయించారు. సోమవారం కౌన్సిల్‌లో జరిగిన హైడ్రామాతో ఎన్నికను ప్రిసైడింగ్‌ అధికారిణి వాయిదా వేశారు.

చైర్‌పర్సన్‌ చాంబర్‌లో టీడీపీ

పెద్దరికం అభాసుపాలు

చైర్‌పర్సన్‌ చాంబర్‌లో వైస్‌చైర్మన్‌ పదవి కోసం ఎంపికపై సయోధ్యకు టీడీపీ పెద్దలు సుగవాసి ప్రసాద్‌బాబు, దీపక్‌రెడ్డి, ఉక్కుప్రవీణ్‌ చేసిన పెద్దరికం అభాసుపాలైంది. వారు టీడీపీ ఇన్‌చార్జి చమర్తి జగన్‌మోహన్‌రాజుతో సమావేశమయ్యారు. అప్పుడు అక్కడే వైస్‌ చైర్మన్‌ పదవి పైకి వద్దంటూనే, పొందాన్న ఆలోచన లోలోపల భావనతో ఉన్న చైర్‌పర్సన్‌ తండ్రి దొంతశివ అభ్యంతరాలు, వాదోపవాదాలకు దిగారు. చివరికి ఆ పదవి తనకు అక్కర్లేదని తప్పుకొన్నారు.

అయ్యో... బాబు సామాజిక వర్గమా..

సీఎం చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన ఓ కౌన్సిలర్‌కు వైస్‌చైర్మన్‌ కేటాయించే విషయంలో మొండిచెయ్యి చూపారు. ముందుగా వ్యూహాత్మకంగా వైస్‌చైర్మన్‌ పదవి ముస్లిం మహిళకు అధిష్టానం కేటాయిస్తూ బీఫాం జారీ చేసింది. ఈమె స్థానంలో మరో కౌన్సిలర్‌కు ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఆ దిశగా పార్టీ ప్రతినిధులు విప్‌ జారీ చేసి, ప్రిసైడింగ్‌ అధికారికి ఇవ్వాలనే యోచన బహిర్గతమైంది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య చైర్‌పర్సన్‌ చాంబరులో ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది. దొంతంశివ, ఉక్కుప్రవీణ్‌ మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. అరుపులు, కేకలు, ప్రతి సవాళ్లతో చాంబరు దద్దరిల్లిపోయింది.

మనస్తాపంతో వెళ్లిపోయిన సీఐ

సీఐ హేమసుందరనాయుడు జోక్యం చేసుకున్నా లెక్కచేయని రీతిలో తమ్ముళ్లు వ్యవహరించారు. దీంతో తన సిబ్బందితో సీఐ మనస్తాపంతో చాంబర్‌ నుంచి వెళ్లిపోయారు. అధిష్టానం ముందు ఇచ్చిన కౌన్సిలర్‌ వైస్‌ చైర్మన్‌గా ఉండాలని టీడీపీ ఇన్‌చార్జి చమర్తితోపాటు కొంత మంది టీడీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. కౌన్సిలర్‌ దొంతశివకే వైస్‌చైర్మన్‌ కేటాయించాలని కౌన్సిలర్లు మరోవైపు ప్రతిపాదన లేవనెత్తారు. చివరికి రాజీనామా చేసేందుకు కూడా కొంత మంది కౌన్సిలర్లు సిద్ధమై వచ్చారు. ఎట్టకేలకు వైస్‌ చైర్మన్‌ పదవి షబ్రీన్‌నూర్‌కే దక్కింది. ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

వైస్‌ చైర్మన్‌ పీఠం కోసం దొంతం

శివ వ్యూహం

నేతలు, కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వాదం

అధిష్టానం ఆదేశాలతో షబ్రీన్‌నూర్‌కే దక్కిన పదవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement