లారీ ఢీకొని వృద్ధురాలి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని వృద్ధురాలి దుర్మరణం

Nov 25 2026 2:30 AM | Updated on Nov 25 2026 2:30 AM

ఎర్రగుంట్ల : మండల పరిధి చిలంకూరు గ్రామంలో మంగళవారం లారీ ఢీకొని ఓ వృద్ధురాలు దుర్మరణం చెందారు. ఎర్రగుంట్ల ఎస్‌ఐ–2 రామాంజనేయులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ముద్దనూరు మండల పరిధిలోని పెనికలపాడు గ్రామానికి చెందిన రాజోలి వెంకటసుబ్బమ్మ(80) ఆరోగ్యం బాగలేక స్థానికంగా ఉన్న వైద్యులు వద్ద చూపించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. జెడ్పీ పాఠశాల ఎదురుగా వెనుక నుంచి లారీ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటసుబ్బమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ–2 తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement