ప్రొద్దుటూరు : గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీ సందర్భాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డిని మంగళవారం హౌస్ అరెస్టు చేశారు. గ్రామాల్లో పలు చోట్ల వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన అభ్యర్థులకు ఇబ్బందులు ఏర్పడినా.. రాచమల్లు శివప్రసాదరెడ్డి బయటికి వెళ్లకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులు కాపలా కాశారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కబంధ హస్తాల్లో జిల్లా కలెక్టర్, పోలీసులు, ఎన్నికల అధికారులు ఉన్నారని రాచమల్లు విమర్శించారు. అధికారుల తీరు ఎన్నికల ప్రక్రియపై అనుమానాలకు తావిస్తోందన్నారు.


