సామాన్యుడిపై మోయలేని భారం
నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరగడం సామాన్యుడిపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోంది. బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె, పాలు, చక్కెర ధరలు పెరిగితే ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల నెలవారి బడ్జెట్‌పై నేరుగా ప్రభావం పడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
– జాలా జయవర్దన్, రాష్ట్ర కార్యదర్శి,
అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ, కడప
ఎట్లా బ్రతకాలో తెలియడం లేదు
మేము కూలీనాలీ చేసుకుని బతికేవాళ్లం. ఆరు నెలల ముందు రూ. 1450 ఉన్న 25 కిలోల బియ్యం మూట ఈరోజు రూ. 1600కు పెరిగింది. కందిబేడలు రూ. 180 నుంచి 200, పామోలిన్ కిలో రూ. 170 నుంచి 190కు, చింతపండు రూ. 150 నుంచి 180కు, ఎర్రగడ్డలు రూ. 30 నుంచి 60కు, పచ్చిమిరప రూ. 50కు చేరుకున్నాయి. మాబోటి వాళ్లకు నెలంతా కష్టపడినా వచ్చే ఆదాయం కూరగాయలకు సరిపోవడం లేదు. ఇక మిగతా అవసరాలు ఎలా తీర్చుకోవాలో తలుచుకుంటే భయమేస్తోంది.
– కై పు సుబ్బమ్మ, రామాంజనేయపురం, కడప
ధరల నియంత్రణకు చొరవ తీసుకోవాలి..
నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పెరిగిన ధరల కు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఇలా చేస్తేనే సామాన్యులు బతకగలరు. లేకుండా వారి జీవనం దుర్భరంగా మా రుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి. – గాలిచంద్ర, ిసీపీఐ జిల్లా కార్యదర్శి
కూటమి సర్కార్‌లో అన్ని పిరమే..
కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అన్ని పిరమయ్యాయి. దీంతో సామాన్యులు, పేదవారు బతికాంటే అప్పులు చేసుకోక తప్పడం లేదు. పైగా రైతులు పండించే పంటలకు మాత్రం గిట్టుబాటు ధరలు లేవు. పెరిగిన ధరలతో అన్ని రకాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
– కందనూరు. వెంకటసుబ్బారెడ్డి, మైదుకూరు


