కడప ఎడ్యుకేషన్ : పిల్లల్లో వికాసం, సృజనాత్మక శక్తిని వెలికితీయడమే బాలోత్సవ లక్ష్యమని కడప బాలోత్సవం జిల్లా అధ్యక్షుడు నాగమునిరెడ్డి అన్నా రు. కడప బాలోత్సవం – 4 ఆహ్వాన సంఘం సమావేశం ఆదివారం యస్. వి. ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో సామాజిక దృక్పథపు ఆలోచనలు రేకెత్తించి వారి శక్తయుక్తులను ప్రదర్శించేందుకు ఒక మంచి వేదికను తీసుకురావాలని చేసిన ప్రయత్న రూపమే ‘కడప బాలోత్సవం‘అని అన్నారు. యస్వీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వీర సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు జాతి నిర్మాతలని.. మనం భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం, భవిష్యత్తు సమాజం బాగుకోసం, బాలోత్సవాలను బాధ్యతగా చేసేందు కు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. రాజశేఖర్ రాహు ల్ మాట్లాడుతూ పిల్లలు విద్యావనాల్లో వికసిత కుసుమల్లా పరిమళించాలన్నారు. పిల్లలకు విద్యతోపాటు విద్యాతర కార్యక్రమాలకు అవసరం అన్నా రు. కడప బాలోత్సవం గౌరవ సలహాదారులు గుర్రాల గోపాల్, వెంకట సుబ్బయ్య, వెంకటేశ్వర రెడ్డి, సత్యనారాయణ, కామేశ్వరమ్మలు మాట్లాడా రు. ఈ కార్యక్రమంలో ఆర్‌యూపీపీ నాయకులు నాగ సురేష్, పీఆర్‌టీయూ నాయకులు తిరుపాల్, ఎంఈఓ సుబ్బారాయుడు, సిఐటియూ నాయకులు మనోహర్, లక్ష్మి దేవి, శ్రీనివాసులు రెడ్డి వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ లక్ష్మి రాజా, వెంకట్రామరాజు, జెవీవీ నాయకులు శివరామ్, ప్రకాశం, ప్రజానాట్య మండలి, కరిముల్లా, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, వ్యవసాయ కార్మిక సంఘం, వెళ్లాలా వెంకటేశ్వరాచారి, గౌరి శంకర్, గోపి ఎలెక్ట్రికల్ గోవిందు తదితరులు పాల్గొన్నారు.


