కడప కార్పొరేషన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో సోషల్ మీడియా విభాగం కీలక పాత్ర పోషించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆ విభాగం సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను, కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిన విధానాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత సోషల్ మీడియా విభాగంపై ఉందన్నారు. అలాగే సోషల్ మీడియాలో వైఎస్సార్‌సీపీపై, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో కీలకంగా పనిచేసే కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి జైళ్లకు పంపిందన్నారు. ప్రభు త్వ వైఫల్యాలను సోషల్ మీడియాలో నిలదీసే వారి ని వేధించి, అక్రమ కేసుల్లో ఇరికించి రాక్షసానందం పొందుతున్నారన్నారు. ఇలాంటి వారికి రాబో యే కాలంలో తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను వేధించి, దాడులకు దిగిన వారికి వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారు సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతామని పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగనన్న 2.0 పాలన కార్యకర్తలకు మేలు చేసే విధంగా ఉంటుందన్నారు. కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను గుర్తు పెట్టుకొని మేలు చేస్తామని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయానికి సోషల్ మీడియా కార్యకర్తలు కష్టపడి పనిచేయాలన్నారు. అధికార పార్టీ నేతలు ఎక్కడ అక్రమాలకు పాల్పడినా సోషల్ మీడియా వేదికగా నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, సోషల్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షుడు వివేక్‌రెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీలు రాజశేఖర్‌రెడ్డి, విజయ్ కుమార్, సునీతారెడ్డి, మన్సూర్, రవిశంకర్, నియోజకవర్గ అధ్యక్షులు దివాకర్‌రెడ్డి, నిశాంత్, మాధవరెడ్డి, వరకుమార్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి


