సాక్షి కడప : వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో విజయవాడ సన్ షైనర్స్ వర్సెస్ తుంగభద్ర వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కడప లోకల్ బాయ్ అదరగొట్టాడు. విజయవాడ తరఫున మిడిల్ ఆర్డర్‌లో బరిలో దిగిన కడపకు చెందిన జహీర్ అబ్బాస్ కేవలం 25 బంతులలోనే నాలుగు 4 సిక్స్‌లు, మూడు ఫోర్‌లతో 52 పరుగులు చేశారు.. లోకల్ బాయ్ ఆడుతున్నప్పుడు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది అబ్బాస్ సిక్స్‌లు, ఫోర్లు కొట్టినప్పుడల్లా ‘పక్కా లోకల్’ పాటలతో స్టేడియం హోరెత్తిపోయింది.
ఆకట్టుకున్న ‘రోబో’
కడపలోని వైయస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో రోబో ఆకట్టుకుంది. ప్రత్యేకంగా వీఐపీలు వచ్చిన సందర్భంలోనూ.. ఇతర కెప్టెన్లు టాస్‌కు వెళుతున్న సందర్భంలో రోబో అలా స్టేడియంలో కనిపించి సందడి చేసింది.
జహీరో అబ్బాస్
52 నాటౌట్ (24 బంతుల్లో)
సిక్సర్లు 4, ఫోర్లు 3


