కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : మహిళలు టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సులను నేర్చుకుని వాటి ద్వారా ఆర్థికంగా స్థిరపడాలని ఇందిరా మహిళా మండలి ప్రెసిడెంట్ వైఎస్ భారతీరెడ్డి పేర్కొన్నారు. సోమవారం కడప నగర శివార్లలో గల రిమ్స్ సమీపంలోని ఇందిరా మహిళా మండలిలో మొదటి విడత ఉచిత టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సులు మూడు నెలలు పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరా మహిళా మండలి ద్వారా పేద ప్రజలకు అనేక సహాయ సహకారాలు అందించడం జరుగుతోందన్నారు. టైలరింగ్‌తోపాటు ఇతర శిక్షణా కార్యక్రమాలను మహిళలు ఎంత మంది అయినా వచ్చి ఉచితంగా నేర్చుకోవచ్చన్నారు. అనంతరం దాదాపు టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సులను పూర్తి చేసుకున్న 40 మంది మహిళలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరా మహిళా మండలి ట్రైనింగ్ ఇన్‌చార్జి సరస్వతమ్మ, మెంబర్లు ఎ.సుశీలమ్మ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.


