రాజంపేట ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్‌ | - | Sakshi
Sakshi News home page

రాజంపేట ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్‌

Jun 14 2026 7:28 AM | Updated on Jun 14 2026 7:28 AM

రాజంపేట : రాజంపేట ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్‌ చేశారు. సూపరింటెండెంట్‌ పీవీఎన్‌ రాజు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒంటిమిట్టకు చెందిన 45 ఏళ్ల వయసు కలిగిన వివాహిత గురువారం ఆస్పత్రికి వచ్చింది. ఆమె కుడి తొడపై పెద్దగడ్డ ఉంది. దానిని ప్రాంతీయ వైద్యుల సలహాతో డాక్టర్‌ పి.వెంకటేశ్వరరాజు, అనస్తీషియా డాక్టర్‌ శిరీష, సిస్టర్‌ సరళ, విజయ్‌కుమార్‌, ప్రియాంక, సహాయకుడు భార్గవ్‌, శ్రీలత ఆపరేషన్‌ పూర్తి చేశారు. గడ్డ శ్యాంపిల్‌ను పరీక్ష నిమిత్తం కడప రిమ్స్‌కు పంపించారు. శనివారం రోజు ఆమెను డిశ్చార్జి చేశారు. కాగా ఈ మహిళ గడ్డతో బాధపడుతూ అనేక కార్పొరేట్‌ ఆసుపత్రులకు వెళ్లారు. కానీ ఫలితం లేకపోయింది. చివరికి ఆమె రాజంపేట ప్రాంతీయ వైద్యశాల సూపరింటెండెంట్‌ పీవీఎన్‌ రాజును సంప్రందించారు. ఆమెకు అన్ని రకాల పరీక్షలు చేశారు. అనంతరం ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తి చేశారు. డాక్టర్‌ పీవీఎన్‌ రాజు, ఆసుపత్రి సిబ్బంది సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు. గడ్డ బరువు కేజీ ఉన్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్‌ పీవీఎన్‌ రాజు మాట్లాడుతూ ఆపరేషన్‌ అనంతరం రోగి ఆరోగ్యకరంగా ఉన్నారని, ఆమెను డిశ్చార్జి కూడా చేశామన్నారు.

తొడపై ఉన్న కేజీ గడ్డ తొలగింపు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement