వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా జాయింట్‌ సెక్రటరీగా రవిశంకర్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా జాయింట్‌ సెక్రటరీగా రవిశంకర్‌

Jun 12 2026 5:39 AM | Updated on Jun 12 2026 5:39 AM

కడప కార్పొరేషన్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా విభాగం జాయింట్‌ సెక్రటరీగా మైదుకూరుకు చెందిన జి.రవిశంకర్‌రెడ్డి నియమితులయ్యారు. అలాగే ప్రొద్దుటూరు నియోజకవర్గ రజక విభాగం అధ్యక్షుడిగా ప్రొద్దుటూరుకు చెందిన ఎం.లింగమయ్యను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

14న పురస్కారాలు ప్రదానం

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : ఇటీవల వెలువడిన పదో తరగతి పరీక్షా ఫలితాలలో మంచి మార్కులు సాధించిన తొగటవీర క్షత్రియ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు తొగటవీర క్షత్రియ సంక్షేమ సంఘం కడప నగరశాఖ అధ్యక్షుడు కళ్యా సుధాకర్‌, ప్రధాన కార్యదర్శి పల్లా నరసింహారావు వెల్లడించారు. గురువారం సంఘం కార్యాలయంలో వారు మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంలో భాగంగా 13 ఏళ్లుగా ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కూడా ఈనెల 14న ఉదయం 10 గంటలకు కడప ప్రెస్‌ క్లబ్‌ లో జరిగే కార్యక్రమంలో విద్యార్థులకు నగదు, ప్రశంసా పత్రాలు, మెడల్స్‌ బహుకరిస్తామన్నారు.

కాశీపురం సుధాకర్‌రెడ్డికి ‘మట్టి మనిషి’పురస్కారం

కడప సెవెన్‌రోడ్స్‌ : అవుకు మండలం కాశీపురం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు గంగిరెడ్డి సుధాకర్‌రెడ్డిని ‘మట్టి మనిషి’పురస్కారానికి ఎంపిక చేశారని తపన సాహిత్యవేదిక వ్యవస్థాపకులు సడ్లపల్లె చిదంబరరెడ్డి తెలిపారు. వ్యవసాయ రంగంలో నిరంతరం అన్నదాతలకు అవగాహన కల్పిస్తూ ప్రోత్సహిస్తున్న సుధాకర్‌రెడ్డిని ఈ అవార్డుకు కమిటీ ఎంపిక చేసిందని పేర్కొన్నారు. ఈనెల 21వ తేది ఉదయం 10 గంటలకు హిందూపురం టీచర్స్‌ కాలనీలోని తమ కార్యాలయంలో పురస్కార ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. మట్టిమనిషి పురస్కారానికి సుధాకర్‌రెడ్డి ఎంపిక కావడంపై కేసీ కెనాల్‌ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్‌ దేవగుడి చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, రేనాటి సూర్యచంద్రుల విగ్రహ కమిటీ ప్రతినిధి దండా ప్రసాద్‌, రాయలసీమ టూరిజం అండ్‌ కల్చరల్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి జనార్దన్‌రాజు హర్షం వ్యక్తం చేశారు.

కష్టపడి చదివితే ఉజ్వల భవిత

మదనపల్లె సిటీ: విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని డీఈఓ సుబ్రమణ్యం అన్నారు. గురువారం స్థానిక లయన్స్‌ కంటి ఆస్పత్రిలో 2025–26 సంవత్సరంలో పదోతరగతిలో ఉత్తమ మార్కులు సాఽధించిన 16 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement