మఠం సత్రాలపై అడ్డంకులు తొలగేనా..? | - | Sakshi
Sakshi News home page

మఠం సత్రాలపై అడ్డంకులు తొలగేనా..?

May 7 2026 7:56 AM | Updated on May 7 2026 7:56 AM

సత్రాలపై బద్వేల్‌ కోర్టు స్టేటస్‌ కో తీర్పు

11 మందికి నోటీసులు

మఠం యాజమాన్యం

ఎలా స్పందిస్తుందో..?

బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం పరిధి 7 ఎకరాలు 77 సెంట్లు. ఈ పరిధిలో ఎలాంటి స్థలాలు, కట్టడాలు ఉన్నా మా పరిధిలో ఉంటాయని గత 50 ఏళ్లుగా నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఇక్కడ పెద్ద సమస్య వచ్చిపడింది. అది ఏమిటంటే దేవస్థానం దక్షణ భాగంలో రథశాల దగ్గర గతంలో కొంతమంది ఆర్యవైశ్యులు భక్తులకోసం విడిది సత్రాలను ఏర్పాటు చేశారు. ఈ సత్రాలు మఠం పరిధిలో ఉన్న 7.77 ఎకరాలలో ఉన్నాయి. ఆర్‌ ఎస్సార్‌ లో మఠం పోరంబోకు స్థలంగా ఉందని మఠం నిర్వాహకులు చెబుతున్నారు. ఈ స్థలంలో గతంలో దాతలు సత్రాలు కట్టించారు. అయితే ఆ సత్రాలు మా పూర్వీకులు కట్టించినవి.. అవి మావి అంటూ జి.సతీష్‌, ఎస్‌ సుప్రజ, ఎ వెంకటసుబ్బయ్య, ఎస్‌ చిన్న సిద్దయ్య, వై సురేంద్ర, దొంతు వెంకటసుబ్బయ్య, డి వెంకటేశ్వర్లు, వై మల్లి, ఎస్‌ వెంకటేశ్వర్లు, ఎస్‌ శేషాద్రి, పి పద్మా అనే 11 మంది ఆ సత్రాలలో వ్యాపారాలు కొనసాగిస్తూ వస్తున్నారు. మఠం నిర్వాహకులకు ఎలాంటి సిస్తు(రుసుం) చెల్లించకుండా ఉండడంతో మఠం అభివృద్ధి కోసం కనీసం బాడుగ ఇవ్వాలని కోరినా ఇవ్వకపోవడంతో సత్రాలు పై పూర్తి హక్కులు మావేనని మఠం నిర్వాహకులు చెప్పినా వారు పెడ చెవిన పెట్టడంతో మఠం నిర్వాహకులు ఈ అంశంపై బద్వేల్‌ కోర్టును ఆశ్రయించారు. కోర్టులో గత కొన్ని ఏళ్లుగా కేసు నడుస్తూ వస్తోంది. ఇదిలా ఉండగా గతంలో ఉన్న పిట్‌పర్సన్‌ శంకర్‌బాలాజీ, స్థానిక నాయకుల సహకారంతో అభివృద్ధి కోసం 11 సత్రాలతో పాటు మిగిలిన సత్రాలను తొలగించి కొంతదూర ప్రాంతంలో తాత్కాలిక రేకుల షెడ్లు నిర్మాణంకు శ్రీకారం చుట్టారు. మొత్తం 24మందికి మఠం నిర్వాహకులు బాడుగలకు ఇవ్వడంతో పాటు వారే షెడ్లను ఏర్పాటు చే సుకున్నారు. ఈ 11 మంది కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే వారు ఇంకా ఆ రేకుల షెడ్లలో చేరలేదు.. ఇదిలా ఉండగా వారం రోజుల క్రితం కోర్టు ఈ అంశంపై 11 మందికి స్టేటస్‌కో ఆర్డర్‌ ఇచ్చింది. ప్రస్తుతం సత్రాలు ఎలా ఉన్నాయో అవి అలానే ఉండాలని కోర్టు ఆర్డర్‌ ఇచ్చింది. మఠం మేనేజర్‌ ఈశ్వరాచారి మాత్రం మఠంకు బాడుగ చెల్లిస్తే మేము ఇచ్చేందుకు సిద్ధంగా ఉండేవాళ్లం.. కానీ వారు గత కొన్ని ఏళ్లుగా మఠంకు ఎలాంటి రుసుం చెల్లించకుండా కాలయాపన చేశారు. ప్రస్తుతం కోర్టు ఆర్డర్‌ ప్రకారం మేము నడుచుకుంటామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement