నిశ్చితార్థం తర్వాత పెళ్లికి నిరాకరించిన యువకుడు | - | Sakshi
Sakshi News home page

నిశ్చితార్థం తర్వాత పెళ్లికి నిరాకరించిన యువకుడు

Apr 22 2026 7:30 AM | Updated on Apr 22 2026 7:30 AM

కడప అర్బన్‌: చుక్కలాంటి అమ్మాయికి.. చక్కనైన అబ్బాయికి ఆర్భాటంగా నిశ్చితార్థం చేశారు. వివాహ ముహూర్తం నిర్ణయించారు. ఈ మధ్యలోనే అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరుగా తెలుసుకునేందుకు సెల్‌ఫోన్‌లలో మాట్లాడుకోవడం, చాటింగ్‌లు చేసుకున్నారు. ఏమైందో ఏమో సదరు యువకుడు ఉన్నట్లుండి తనకు వివాహం చేసుకోవడం ఇష్టం లేదని, ఇప్పటికే నలుగురు యువతులతో ప్రేమ వ్యవహారం నడిచిందని చెప్పుకొచ్చాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి ఈ నెల 20 తేదీన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కడప చిన్నచౌక్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు..

కడప ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని పటేల్‌ రోడ్డుకు చెందిన రెహనా(26) ఎమ్మెస్సీ పూర్తి చేసుకుని ఇంటి వద్ద ఉంటోంది. తండ్రి నాదెళ్ల రాజా మధ్యవర్తుల ద్వారా ప్రొద్దుటూరుకు చెందిన వీర కుమారుడు షాజహాన్‌తో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నారు. ఈఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఇందిరానగర్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిశ్చితార్థం వేడుక జరిగింది. ఆగస్టులో పెళ్లి చేయాలనుకున్నారు. ఈ క్రమంలో షాజహాన్‌ పెళ్లి ఇష్టం లేదంటూ యువతికి చెప్పడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి నాదెండ్ల రాజా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని మంగళవారం మార్చురీకి తరలించారు.

మనస్తాపంతో యువతి ఆత్మహత్య

Advertisement
 
Advertisement
Advertisement