జేసీ నిధి మీనా
కడప సెవెన్ రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సభా భవన్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్‌తో పాటు ఇన్‌చార్జి డీఆర్‌ఓ వెంకట పతి, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అందులో కొన్ని......
● జిల్లాలో ఎన్‌హెచ్ డీసీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం వల్ల చేనేత కార్మికులు నష్టపోతున్నారని చేనేత ఐక్య వేదిక జాతీయ కన్వీనర్ అవ్వారు మల్లికార్జున తెలిపారు. రాయతీ సౌకర్యం కల్పించే ఆ పథకాన్ని ప్రతి చేనేత కార్మికున్ని అందేలా చూడాలన్నారు.
● వేసవి తీవ్రత అధికంగా ఉన్నందువల్ల నగరపాలక సంస్దలో పని చేసే కార్మికుల విధి నిర్వహణ సమయాన్ని ఉదయం 5.30 నుంచి 11.30 వరకు ఉండేలా చూడాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు సుంకర రవి, కంచుపాటి శ్రీరాములు, ప్రకాశ్‌లు కోరారు. అలాగే విధి నిర్వహణలతో మరణించి అప్కాస్ మున్సిపల్ కార్మికుల కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగవకాశం కల్పించాలని కోరారు.


