కడప ఎడ్యుకేషన్: రీజనల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (ఆర్‌ఐపీఈ)గా డాక్టర్. ఎస్ రామకృష్ణ సోమవారం కడపలోని పాఠశాల విద్య ఆర్‌జేడీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన అనంతపురం జిల్లా బుక్కపట్నం డైట్ కళాశాల ఇన్‌చార్జు ప్రిన్సిపల్‌గా పనిచేస్తూ బదిలీపై ఎఫ్‌ఏసీ ఆర్‌ఐపీఈగా జిల్లాకు వచ్చారు. ఈ మేరకు బాధ్య తలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్రీడల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు.
ఆర్‌ఐఈపీని కలిసిన ఏపీ పీఈటీ అండ్ సాప్ అసోసియేషన్ నాయకులు
ఆర్‌ఐఈపీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్. ఎస్ రామకృష్ణను ఏపీ పీఈఓ అండ్ సాఫ్ ఆసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శివ శంకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కిరణ్, ట్రెజరర్ శివకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ అగ్గిరప్పయాదవ్, సంఘం సలహాదారు జిలానీబాష, సంఘ సభ్యులు మాధవి, లక్ష్మి, రాయుడు, మహేశ్వర్‌రెడ్డి, ఓబులేసు, విశ్వనాథ్‌లతోపాటు ఉపాధ్యాయులు కలిసి పూలగుచ్చంతో అభినందనలు తెలిపారు.
ఏఐ..ప్రపంచాన్ని శాసిస్తుంది
కురబలకోట: ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తిగా ఏఐ నిలవబోతోందని బెంగళూరులోని క్లౌడ్ సెక్ కంపెనీ సీనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ జయంత్ శర్మ అన్నారు. అంగళ్లు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో సోమవారం జరిగిన ప్రాజెక్ట్ ఎక్స్‌పో ఆన్ ఏఐ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ ఏఐ, మెషిన్ లర్నింగ్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ణానాలు భవిష్యత్ ప్రపంచాన్ని మార్చే శక్తిగా నిలుస్తాయన్నారు.


