రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ దుర్మరణం

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

రాజంపేట : చిట్వేలి పోలీసుసేష్టన్‌లో విధులు నిర్వర్తించేందుకు కానిస్టేబుల్‌ కే.సుధాకర్‌రాజు (56) రాజంపేట నుంచి బయలుదేరిన క్రమంలో సోమవారం పోలిచెరువు వద్ద డివైడర్‌ను ఢీ కొని మృతి చెందారు. దీంతో రాజంపేట సబ్‌బ్‌డివిజన్‌ పోలీసువర్గాల్లో విషాధచాయలు అలుముకున్నాయి. సుధాకర్‌రాజు గతంలో రాజంపేట, మన్నూరు పోలీసుస్టేషన్‌లో పనిచేశారు. విధి నిర్వహణలో సుధాకర్‌రాజు క్రమశిక్షణతో పనిచేసేవారని తోటి కానిస్టేబుళ్లు గుర్తుచేసుకున్నారు. మృతదేహాన్ని రాజంపేట ప్రాంతీయవైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టరం నిర్వహించి, సంబంధీకులకు అప్పగించారు. సుధాకర్‌రాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు రాజంపేట పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ నుంచి ఏ ఆర్‌, అక్కడి నుంచి సివిల్‌ కానిస్టేబుల్‌గా ప్రస్తుతం చిట్వేలిలో పనిచేస్తున్నారు.

నీళ్ల బకెట్‌లో పడి చిన్నారి మృతి

బి.కోడూరు : మండలంలోని రాజుపాలెం దళితవాడకు చెందిన చిన్నగురయ్య, సుమతిల మూడు సంవత్సరాల కుమారుడు మున్నెల్లివిహాన్‌ సోమవారం రాత్రి ఆడుకుంటూ నీళ్ల బకెట్‌లో పడి మృతిచెందాడు. విహాన్‌ కనిపించలేదని వెతుకుతుండగా నీళ్లబకెట్‌లో పడి ఉండటాన్ని గమనించారు. బయటికి తీయగా అప్పటికే మృతిచెందాడు. బాలుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement