గొప్ప తత్వవేత్త మహాత్మా బసవేశ్వరుడు | - | Sakshi
Sakshi News home page

గొప్ప తత్వవేత్త మహాత్మా బసవేశ్వరుడు

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

కడప కోటిరెడ్డి సర్కిల్‌ : సమానత్వం, న్యాయం, ధర్మం కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప తత్వవేత్త, కవి, సంఘ సంస్కర్త మహాత్మా బసవేశ్వరుడు అని జిల్లా ఎస్సీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ కొనియాడారు. జిల్లా ఎస్సీ కార్యాలయంలో సోమవారం మహాత్మా బసవేశ్వర జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్సీ మాట్లాడుతూ బసవేశ్వరుడు 12వ శతాబ్దంలో కర్ణాటక ప్రాంతంలో జన్మించి సమానత్వం, న్యాయం, ధర్మం కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహనీయుడు అన్నారు. బసవేశ్వరుడు భక్తి మార్గాన్ని ప్రజలకు సులువుగా అర్థమయ్యేలా వచనల రూపంలో ప్రవచించారన్నారు. ఈ వచనాలు సరళమైన భాషలో ఉన్నప్పటికి లోతైన సాత్విక సందేశాన్ని అందిస్తాయన్నారు. కార్యక్రమంలో ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ రమణయ్య, ఏఆర్‌ డీఎస్పీ నాగేశ్వరరావు, పాల్గొన్నారు.

గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించాలి

ప్రజల నుంచి పీజీఆర్‌ఎస్‌కు వస్తున్న ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ సూచించారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో చట్ట పరిధిలో పరిష్కరించాలని సూచించారు. అడిషనల్‌ ఎస్పీ ప్రకాష్‌ బాబు, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ సుధాకర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement