దళితులను రాష్ట్రంలో బతకనివ్వరా! | - | Sakshi
Sakshi News home page

దళితులను రాష్ట్రంలో బతకనివ్వరా!

Apr 21 2026 4:08 AM | Updated on Apr 21 2026 4:08 AM

రాజంపేట : దళితులను రాష్ట్రంలో బతకనివ్వరా అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీసెల్‌ ప్రధాన కార్యదర్శి, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ దండుగోపి ధ్వజమెత్తారు. సోమవారం వైఎస్సార్‌సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దళితుల వ్యతిరేక పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశమే అని అనన్నారు. దళితులు అంటే చంద్రబాబుకు చిన్నచూపు అని తెలిపారు. గతంలో అనేక సంఘటనల నేపథ్యంలో చంద్రబాబు వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. దళితులను హత్య చేసేందుకు అయినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెనుకంజ వేయడం లేదనడానికి ఒంటిమిట్ట దళిత యువకుడు ఈరి హర్షవర్ధన్‌పై జరిగిన దాడే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో పవిత్ర పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న ఒంటిమిట్టలో ఆధ్యాత్మిక వాతావరణానికి ముప్పు తెచ్చేలా టీడీపీ రౌడీమూకలు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. టీడీపీ అగ్రకులానికి చెందిన వారు దళిత యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి, గాయపరచడం దారుణమన్నారు. టీడీపీ రౌడీమూకలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్సీసెల్‌ నేత

దండుగోపి ధ్వజం

Advertisement
 
Advertisement
Advertisement