22న జిల్లాస్థాయి బాస్కెట్‌ బాల్‌ ఎంపికలు | - | Sakshi
Sakshi News home page

22న జిల్లాస్థాయి బాస్కెట్‌ బాల్‌ ఎంపికలు

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

22న జిల్లాస్థాయి బాస్కెట్‌ బాల్‌ ఎంపికలు నేడు పసుపు విక్రయాలు జరగవు సేవా కార్యక్రమాల్లో ట్రస్ట్‌ కాల్‌ సెంటర్‌ సేవలను వినియోగించుకోవాలి

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: నగరంలోని జయనగర్‌ కాలనీ జడ్పీ గర్ల్స్‌ హైస్కూల్‌లో ఈ నెల 22న జిల్లాస్థాయి బాస్కెట్‌బాల్‌ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సహదేవరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 2008 జనవరి 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారులు తమ ఒరిజినల్‌ ఆధార్‌ కార్డుతో హాజరుకావాలన్నారు. జిల్లా స్థాయికి ఎంపికై న క్రీడాకారులు మే 1 నుంచి 4 వరకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు.

కడప అగ్రికల్చర్‌: కడప మార్కెట్‌యార్డులో సోమవారం పసుపు క్రయవిక్రయాలు జరగవని కడప వ్యవసాయ మార్కెట్‌ కమిటీ సెక్రటరీ బి. శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఇక మీదట పసుపును రోజు మార్చి రోజు క్రయ విక్రయాలను చేపడతామని తెలిపారు. ప్రస్తుతం రైతులు భారీగా పసుపును అమ్మకం నిమిత్తం కడప మార్కెట్‌యార్డుకు తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. అందువల్ల ఒకే రోజు టెండర్‌, తూకాలతోపాటు తూకం అయిన సరుకు బయటకు పంపడం ఆలస్యం అవుతుందని తెలిపారు. అంతేకాక కడప మార్కెట్‌యార్డు సామర్థ్యం రోజుకు 2500 క్వింటాళ్ల కాగా ప్రస్తుతం రోజుకు 3500 క్వింటాళ్లు సరుకు వస్తోందని తెలిపారు. వచ్చిన మొత్తం సరుకును అన్‌లోడింగ్‌ చేసి టెండరుకు పెట్టడానికి మార్కెట్‌యార్డులో స్థలం సరిపోవడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో పసుపు కోనుగోలుదారులు, కమీషన్‌ ఏజెంట్లతో చర్చించి రైతుల సౌకర్యార్థం మార్కెట్‌ యార్డులో పసుపును రోజు మార్చి రోజు క్రయ విక్రయాలు జరిగేలా నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

నందలూరు: శ్రీ సౌమ్యనాథ సేవా ట్రస్ట్‌ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సమాయత్తమైందని ట్రస్ట్‌ ఫౌండర్‌ ఛైర్మన్‌ యద్దల సుబ్బరాయుడు తెలిపారు. ట్రస్ట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు 2026 సంవత్సరం మార్చి 31వ తేదీకి వివిధ బ్యాంకుల్లో రూ.2,51,38,720లకు చేరుకున్నా యని పేర్కొన్నారు. ఆదివారం సేవ ట్రస్ట్‌లో ట్రస్టు సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరాయుడు మాట్లాడుతూ 2025– 26 మార్చి నాటికి అన్నదాన పథకానికి అయిన జమా ఖర్చులు పరిశీలించామని తెలిపా రు. ఈ వేసవి కాలంలో భక్తులకు మంచినీటి వసతి కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రస్ట్‌ కోశాధికారి చక్రాల రామసుబ్బన్న, కార్యదర్శి కె.శైలేంద్రనాథ్‌, గంటా వాసుదేవయ్య, పల్లె సుబ్రమణ్యం, జంగంశెట్టి వెంకటసుబ్బయ్య, మోడపోతుల రాము, లంకాయగారి సుబ్బరామయ్య, సర్దార్‌ పాల్గొన్నారు.

కడప సెవెన్‌రోడ్స్‌: కలెక్టరేట్‌లో సోమవారం జరిగే కాల్‌ సెంటర్‌, ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు వినియోగించుకోవాలని డీఆర్‌ఓ మల్లికార్జునుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా,లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్‌ చేయాలని సూచించారు.

● సోమవారం కలెక్టరేట్‌ లోని సభా భవన్‌లో ప్రజాసమస్యలపరిష్కార వేదిక (పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రీడ్రసెల్‌ సిస్టం, పిజిఆర్‌ఎస్‌) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, కలెక్టరేట్‌ లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌ )‘ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్‌ స్థాయిలో కూడా ఉంటుందని వివరించారు.

డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమం

డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి ఉదయం 10 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562–244437 ల్యాండ్‌ లైన్‌ నెంబరుకు ఫోన్‌ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement