కూటమి నేతలు క్రీడాకారులకు ఆటంకాలు సృష్టిస్తోంది. ‘పూర్తయిన టర్ఫ్ పిచ్ గ్రౌండ్‌కు తాళం వేశారు.. కీ ఓపెన్ చేయండి సార్’ అంటూ పలువురు ఆటగాళ్లు పొరుగునే ఉన్న క్రీడా శాఖ మంత్రిని విన్నవించారు... కనిపించిన అధికారులను అడిగారు.. కడప ఎమ్మెల్యేని వేడుకున్నారు.. ఎవరికీ మనసు రాలేదు.. జాతీయ క్రీడపై, క్రీడాకారులపై కాస్తయినా కనికరం చూపలేదు.. అధికారంలో ఉన్న వీళ్లు ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. హాకీ కోర్టుకి వేసిన తాళం తీస్తే చాలు..అది చేయడానికి వీరికి చేతు లు రావడం లేదు.. సందర్భం వస్తే వేదికలపై గొప్ప ఉపన్యాసాలు, విన్యాసాలు చేసే కూటమి నేతలకు, అధికారులకు క్రీడాకారులకు మేలు చేయాలనే తలంపు లేకపోవడం విచారకరమని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా హాకీ కోర్టుకి వేసిన తాళం తీసేసి ప్రాక్టీస్ చేసుకునే చర్యలు చేపట్టాలని క్రీడాకారులు కోరుతున్నారు


