ముద్దనూరు : స్థానిక అప్‌గ్రేడ్ పోలీస్‌స్టేషన్‌ను ఆదివారం సాయంత్రం ఎస్వీగిరి కాలనీకి చెందిన దళితులు ముట్టడించారు.సుమారు గంటసేపు స్టేషన్ ఆవరణలో గుమికూడారు.బాధిత దళితుల సమాచారం మేరకు ఎస్వీగిరి కాలనీకి చెందిన శివకుమార్ అనే దళిత యువకున్ని ఆదివారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఎటువంటి కారణం లేకుండా పోలీసులు కొట్టారని, దీంతో శివకుమార్‌కు గాయాలయ్యాయని, బాధితున్ని బయటకు పంపించాలని నినదించారు.అనంతరం శివకుమార్‌ను బంధువులు ఆసుపత్రికి తరలించారు.ఈ సంఘటనపై సీఐ నగేష్‌బాబు మాట్లాడుతూ ఆదివారం ఉదయం స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించామని, శివకుమార్ కూడా రౌడీషీటర్ కావడంతో కౌన్సెలింగ్‌లో భాగంగా అతనిని మందలించినట్లు తెలిపారు.


