పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో వృద్ధురాలు మృతి | - | Sakshi
Sakshi News home page

పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో వృద్ధురాలు మృతి

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

వల్లూరు : పుష్పగిరిలో ఆదివారం రాత్రి మైదుకూరు ప్రాంతానికి చెందిన సుమారు 70 సంవత్సరాల వయసు గల సుబ్బమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. బ్రహ్మోత్సవాలను పురష్కరించుకుని దైవ దర్శనాలతోపాటు రాత్రి పుష్పగిరిలో బస చేయాలనే ఉద్దేశంతో కొందరు బంధువులతో కలిసి వచ్చింది. పెన్నా నది ఒడ్డున జరుగుతున్న అన్నదాన కార్యక్రమం వద్ద అందరితో కలిసి భోంచేసింది. అనంతరం అందరూ కలిసి సమీపంలో కూర్చుని మాట్లాడుకుంటుండగా సుబ్బమ్మ గుండెల్లో నొప్పిగా వుందంటూ పక్కకు ఒరిగింది. ఆమెకు సపర్యలు చేసినప్పటికీ అప్పటికే మృతి చెందింది. ఎండ తీవ్రత నేపథ్యంలో వడదెబ్బతో ఆమె మృతి చెంది ఉండవచ్చని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు బంధువులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement