చేపలు పట్టేందుకు వెళ్లి మృత్యువాత | - | Sakshi
Sakshi News home page

చేపలు పట్టేందుకు వెళ్లి మృత్యువాత

Apr 20 2026 7:30 AM | Updated on Apr 20 2026 7:30 AM

ప్రొద్దుటూరు క్రైం : మండల పరిధిలోని కల్లూరు గ్రామ శివారులో చేపలు పట్టేందుకు వెళ్లిన కంబగిరి (50) విద్యుత్‌ షాక్‌తో మృత్యువాత పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాళ్లమాపురం గ్రామానికి చెందిన కంబగిరి వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. గ్రామంలోని కొందరు వ్యక్తులతో కలిసి అతను ఆదివారం కల్లూరు కేసీ కాలువ వద్దకు వెళ్లాడు. కాలువ సమీపంలో ఉన్న విద్యుత్‌ స్తంభం నుంచి లైను లాగి ఎలక్ట్రికల్‌ మిషన్‌ ద్వారా అందరూ చేపలు పట్టసాగారు. ఈ క్రమంలో కంబగిరి అనుకోకుండా నీళ్లలోకి దిగడంతో విద్యుత్‌ షాక్‌ తగిలి మృతి చెందాడు. మృతుడి భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement