కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని కడప జిల్లా రికగ్నైజ్డ్ అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్‌ట్ అసోసియేషన్ (క్రుష్మ) జిల్లా అధ్యక్షుడు లెక్కల జోగిరామిరెడ్డి పేర్కొన్నారు. క్రుష్మ జనరల్ బాడీ సమావేశం ఆదివారం కడపలోని రాయచోటి రోడ్డు రోడ్డులో ఉన్న ఎస్పీ కన్వెన్షన్ హాలులో జరిగింది. ఈ సందర్భంగా క్రుష్మ జిల్లా అధ్యక్షుడు లెక్కల జోగిరామిరెడ్డి మాట్లాడుతూ విద్యా ప్రమాణాలను నిలబెట్టేందుకు కృషి చేస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. ఈ తరుణంలో కలసికట్టుగా ముందుకు సాగి సమస్యలను పరిష్కరించుకుందామని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఒక సంవత్సరం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయలు ఇవ్వలేదన్నారు. దీనివల్ల ప్రవేట్ పాఠశాలలకు లక్షల రూపాయలు బకాయిలు ఉన్నామయన్నారు. ఈ విషయమై ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్, కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ను కలిసినప్పుడు ఫీజులు చెల్లిస్తామని హామీ ఇచ్చినా ఒక్క సంవత్సరానికి మాత్రమే ఫీజు బకాయిలు చెల్లించారన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కచ్చితంగా పూర్తి బకాయిలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు క్రుష్మ నాయకుల మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు.
నూతన కమిటి ఎన్నిక : జనరల్ బాడీ సమావేశం అనంతరం క్రుష్మ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా లెక్కల జోగిరామిరెడ్డి (పవన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, కడప), ప్రధాన కార్యదర్శిగా సిఎస్.రామాంజనేయరెడ్డి (స్వామి వివేకానంద హై స్కూల్ కరస్పాండెంట్, వేంపల్లి), శ్రీ సరస్వతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ సుబ్రమణ్యం కోశాధికారిగా మరో 25 మంది కరస్పాండెంట్లను ఎగ్జిక్యూటివ్ కమిటీలో వివిధ హోదాల్లో ఎన్నుకున్నారు.
క్రుష్మ జిల్లా అధ్యక్షుడు లెక్కల జోగిరామిరెడ్డి


