అగ్గితో ఆటలొద్దు గురూ! | - | Sakshi
Sakshi News home page

అగ్గితో ఆటలొద్దు గురూ!

Apr 19 2026 7:35 AM | Updated on Apr 19 2026 7:35 AM

అగ్గితో ఆటలొద్దు గురూ! ●అగ్నిమాపక శాఖలో వేధిస్తున్న సిబ్బంది కొరత ●అగ్ని ప్రమాదాల నివారణపై పాటించాల్సిన నియమాలు

ఓవైపు మండే ఎండలు...మరోవైపు చెలరేగుతున్న మంటలు

జిల్లాలో కొనసాగుతున్నఅగ్నిమాపక వారోత్సవాలు

కడప అర్బన్‌: ఎండలు మండే నిండు వేసవి కాలమిది.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న మంటలు చేలరేగి అగ్ని ప్రమాదాలు సంభవించే సమయమిది.. జిల్లా వ్యాప్తంగా ప్రజలు అగ్నిప్రమాదాల బారి నుంచి తమతో పాటు చుట్టు ఉన్న సమాజాన్ని కాపాడుకునేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భమిది. ఈ నేపథ్యంలో అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా అగ్నిమాపక శాఖ వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ నెల 14 నుంచి ప్రారంభమైన వారోత్సవాలు 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేయనున్నారు.

● గత ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు అగ్నిమాపక శాఖకు 111 కాల్స్‌ వచ్చాయి.

● ఇందులో 15 రిస్క్‌ ఆపరేషన్‌ ప్రమాదాలు జరి గాయి. రూ. 7,94,26,500 నష్టం జరిగింది.

● రూ.27,15,44,000 ఆస్తినష్టాన్ని ఫైర్‌ అధికారులు రక్షించారు. ఇక అగ్ని ప్రమాదాలు నీటి ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాల కారణంగా 10 మంది చనిపోగా, 10 మందిని అగ్నిమాపక శాఖ ద్వారా కాపాడారు.

ప్రమాదాలను నివారించే అగ్నిమాపక శాఖ లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లాలో 10 ఫైర్‌ స్టేషన్‌లున్నాయి. ముద్దనూరులో ఫైర్‌ స్టేషన్‌ నిర్మాణ దశ త్వరలో పూర్తి కానుంది. కాగా ఆయా అగ్నిమాపక కేంద్రాల్లో లీడింగ్‌ ఫైర్మెన్లు, ఫైర్మెన్లు, డ్రైవర్‌ కమ్‌ ఆపరేటర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. జూనియర్‌ అసిస్టెంట్లు ముగ్గురు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఇద్దరే ఉన్నారు. పలుచోట్ల స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసరు లేకపోవడంతో ఇన్చార్జి లీడింగ్‌ పైర్‌మెన్‌ విధులు నిర్వహిస్తున్నారు. డ్రైవర్‌ కమ్‌ ఆపరేటర్‌ 35 మందికిగాను ప్రస్తుతం 33 మంది విధులు నిర్వహిస్తున్నా రు. 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక పైర్‌మెన్‌ 108 మంది ఉండాల్సి ఉండగా 36 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే 101కు సమాచారం అందించాలి

ప్రమాదాలను

ఎదుర్కొనేందుకు సిద్ధం

అగ్ని ప్రమాదాలు, విపత్తు లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా ం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ హోంగార్డులకు కూడా రెస్క్యూ ఆపరేషన్లపై శిక్షణ ఇచ్చాం. ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.

–శరత్‌బాబు,జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి

‘అగ్నిని ఆర్పడం కంటే అగ్ని నిరోధక చర్యలే’మేలు...!

చిన్నపిల్లల దగ్గర అగ్గిపెట్టెలు,లైటర్లు, టపాకాయలు ఇతర మండే పదార్థాలు ఏవీ అందుబాటులో ఉంచరాదు.

కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పకుండా అజాగ్రత్తగా పారవేయరాదు.

ఐ.ఎస్‌.ఐ ఎలక్ట్రికల్‌ వైరింగ్‌ పరికరాలనే ఉపయోగించాలి. పాడైన వైర్లను వాడకూడదు. ఓవర్‌లోడ్‌ వేయకూడదు. ఎలక్ట్రికల్‌ సాకెట్‌లో దాని కెపాసిటీకి తగిన ప్లగ్‌ను మాత్రమే వాడాలి.

ఇంటి నుంచి ఎక్కువ రోజులు బయటకు వెళ్లునపుడు ఎలక్ట్రికల్‌ మెయిన్‌ ఆఫ్‌ చేయాలి.

గ్యాస్‌ లీకవుతున్నట్లు అనుమానం వస్తే రెగ్యులేటర్‌ వాల్వ్‌ను ఆపివేయాలి. అలాంటి సమయంలో ఎలక్ట్రికల్‌ స్విచ్‌లు ఆన్‌/ఆఫ్‌ చేయరాదు.

స్కూల్స్‌, హాస్పిటల్స్‌, షాపింగ్‌ మాల్స్‌లో ఆర్‌సీ సీ లేదా కాంక్రీట్‌ శ్లాబులను పైకప్పుగా వాడాలి.

ఫైర్‌ అలారం, ఫైర్‌ స్మోక్‌ డిటెక్టర్‌లను అవసరమైన ప్రదేశాలలో ఏర్పాటు చేయాలి. సెల్లార్‌లలో ఆటోమేటిక్‌ స్ప్రింక్లర్‌లు ఉపయోగించాలి.

గ్రామీణ ప్రాంతాల్లో గడ్డి వాములను నివాస ప్రాంతాలకు దూరంగా వుండేలా చూసుకోవాలి.

కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు అగ్నిప్రదేశాలు గుర్తించేలా చేయాలి. వారికి బేసిక్‌ ఫైర్‌ ఫైటింగ్‌పై శిక్షణ ఇవ్వాలి.

Advertisement
 
Advertisement
Advertisement