రేపటి నుంచి డీఎల్‌ఈడీ సెమిస్టర్స్‌ | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి డీఎల్‌ఈడీ సెమిస్టర్స్‌

Apr 19 2026 7:35 AM | Updated on Apr 19 2026 7:35 AM

రేపటి నుంచి డీఎల్‌ఈడీ సెమిస్టర్స్‌ 25న సీతా జయంతి మహోత్సవం భవన నిర్మాణ కార్మికుల పథకాల పునరుద్ధరణ దరఖాస్తుల ఆహ్వానం

కడప ఎడ్యుకేషన్‌: డీఎల్‌ఈడీ (డిప్లమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌) మొదటి, నాల్గవ సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 20 నుంచి 25 తేదీ వరకు జరగనున్నట్లు డీఈఓ షేక్‌ షంషుద్దీన్‌ తెలిపారు. దీంతోపాటు సీఎల్‌ఐఎసీ(సర్టిఫికెట్‌ ఇన్‌ లైబ్రరీ సైన్సు) పరీక్షలు జరగనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్సును www.bse.ap.gov.in వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపారు. అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షలకు హాజరు కావాలని డీఈఓ సూచించారు.

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఏప్రిల్‌ 25న శ్రీ సీతా జయంతి మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆ రోజు సాయంత్రం 5:30 నుంచి 7:30 గంటల వరకు పలు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. కార్యక్రమాలు ఆలయ ప్రదక్షణతో ప్రారంభమై, భగవత్‌ అనుగ్ఞ, విష్వక్సేన ఆరాధన, వాసు దేవ పుణ్యాహవచనం నిర్వహిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సీతమ్మవారి అనుగ్రహం, కృపాకటాక్షాలను పొందాలని కోరారు.

కడప సెవెన్‌రోడ్స్‌: భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన ప్రసూతి సహాయం, వివాహ కానుక, అంత్యక్రియల ఖర్చులు, సహజ మరణానికి సంబంధించిన ఆర్థికసాయం అనే నాలుగు పథకాలను పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. భవన ఇతర నిర్మా ణ రంగ కార్మికులు పై పథకాలకు సంబంధించి తమ దరఖాస్తులను సమీపంలోని సహాయ కార్మిక అధికారి లేదా గ్రామ సచివాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు. ఏపీ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మిక సంక్షేమ బోర్డులో లబ్దిదారులుగా తమ పేర్లు నమోదు, నవీకరణ చేసుకుని ఆయా సంక్షేమ పథకాల లబ్ధి పొందాలని సూచించారు.

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని అత్యున్నత పద్మ అవార్డులతో ( పద్మ విభూషణ్‌, పద్మ భూషణ్‌, పద్మశ్రీ) భారత ప్రభుత్వం ఏటా సత్కరిస్తోందని.. వీటికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని డీఎస్‌డీవో షేక్‌ గౌస్‌ బాషా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్ట్‌, లిటరేచర్‌, విద్య, క్రీడలు, మెడిసిన్‌, సోషల్‌ వర్క్‌, సైన్స్‌ ఇంజనీరింగ్‌, పబ్లిక్‌ అఫైర్స్‌, సివిల్‌ సర్వీసెస్‌, ట్రేడ్‌ ఇండస్ట్రీ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారితో పాటు క్రీడల్లో విశేష ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ పోర్టల్‌ https://awards.gov.in ద్వారా దరఖాస్తులు సమర్పించాలని, పూర్తి వివరాలకు జిల్లా ప్రాధికార సంస్థ కార్యాలయ పని వేళల్లో సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement