ఎర్రగుంట్ల: మన జలమే మన జీవనం అన్న విధంగా నీటిని వృథా కాకుండా పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. శనివారం పోట్లదుర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జలధార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కడప జిల్లాను కాలుష్యరహిత, స్వచ్ఛజిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డి, డ్వామా పీడీ అదిశేషారెడ్డి, గ్రౌండ్ వాటర్ పీడీ మురళీ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఏడుకొండలు, జమ్మలమడుగు ఇన్‌చార్జి ఆర్డీఓ శిరీషా పాల్గొన్నారు.
స్మార్ట్ కిచెన్ పరిశీలన: ఎర్రగుంట్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మాణంలో ఉన్న స్మార్ట్ కిచెన్‌ను శనివారం జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పరిశీలించారు. ఇక్కడ పనిచేస్తున్న పొదుపు సంఘాల మహిళలకు సూచనలు అందించారు. వంటవార్పునకు సంబంధించి శిక్షణ తీసుకున్నారా అడిగి తెలుసుకున్నారు. పంచాయతీరాజ్ ఎస్‌ఈ మద్దెన్న, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఏడుకొండలు, స్మార్ట్ కిచెన్ నోడల్ అధికారి విజయ్‌కుమార్, ఏడీఈ కిరణ్‌కుమార్, అర్‌డబ్ల్యూఎస్ ఎఈ రామ్మోహన్‌రెడ్డి, ఏపీఎం జగదీశ్వరి పాల్గొన్నారు.
‘పీఎం రాహత్’తో ఆరోగ్య భద్రత
కడప సెవెన్‌రోడ్స్: రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ, నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం రాహత్ పథకం జిల్లా ప్రజల పాలిట వరం అని, వారి ఆరోగ్య భద్రతలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శనివారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రచురించిన.. ‘పీఎం రాహ త్ పథకానికి సంబంధించిన ప్రచార పోస్టర్లను కలెక్టర్ ఆష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాద బాధితులకు ఒక్కో సంఘటనకు గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స అందించబడుతుందని చెప్పారు. ‘‘గోల్డెన్ అవర్’’లో వైద్య సహాయం అందించడం ద్వారా ప్రాణనష్టం తగ్గించడమే ఈ పథక లక్ష్యమని వివరించారు.
జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్


