వైభవం.. బ్రహ్మోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. బ్రహ్మోత్సవం

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

వల్లూరు: పుష్పగిరి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర స్వామి సింహ వాహనంపై, శ్రీ చెన్న కేశవ స్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం శ్రీ వైద్యనాధ్యస్వామికి అర్చకులు రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీ కామాక్షీ అమ్మవారికి, శ్రీ చక్రానికి కుంకుమార్చన చేశారు. రాత్రి మంగళ వాయిద్యాలు, దివిటీల వెలుగుల మధ్య స్వామి వారి గ్రామోత్సవాన్ని పుష్పగిరి మాడ వీధుల్లో ఘనంగా నిర్వహించారు.

● కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు అఖిల్‌ దీక్షితులు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలను, తోమాల సేవ నిర్వహించారు.సాయంత్రం వివిధ హోమాలు జరిపారు. రాత్రి హంస వాహనం అధిష్టించిన చెన్న కేశవ స్వామివారిని కొండపై నుంచి పెన్నా నది మీదుగా గ్రామంలోకి తీసుకొచ్చి పుష్పగిరి గ్రామ మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.

హంస వాహంపై చెన్న కేశవుడు

సింహ వాహనంపై వైద్యనాఽథేశ్వరుడు

Advertisement
 
Advertisement
Advertisement