సోలార్‌ కోసం భూముల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

సోలార్‌ కోసం భూముల పరిశీలన

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

సోలార్‌ కోసం భూముల పరిశీలన ఉర్దూ కవులకు ఆహ్వానం టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌ కోర్సుకు దరఖాస్తులు

మైలవరం: మండల పరిధిలోని సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు కోసం జాయింట్‌ కలెక్టర్‌ నిధిమీనా భూములను పరిశీలించారు. శుక్రవారం మండల పరిధిలోని దొడియం, రామచంద్రాయపల్లి, వద్దిరాల, తలమంచిపట్నం, కోనా అనంతపురం గ్రామాలకు సంబంఽధించిన భూములను పరిశీలించారు. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇన్‌చార్జి అర్డీఓ శీరిష , తహసీల్దార్‌ షఫీలు వివరించారు.

కడప ఎడ్యుకేషన్‌: ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని తుమ్మలపల్లె కళాకేత్రంలో జాతీయ త్రిభాష కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు, సంస్థ చైర్మన్‌ మహమ్మద్‌ ఫారూఖ్‌ షిబ్లి, ఉర్దూలకు ఆహ్వానం పంపారని రాయల సీమ ఉర్దూ రచయితల సమాఖ్య ప్రధాన కార్యదర్శి సత్తార్‌ ఫైజి తెలిపారు. ఉమ్మడి వైఎస్సార్‌ కడప జిల్లా నుంచి ఉర్దూ కవులు ఆచార్య సత్తార్‌ సాహిర్‌, మహమూద్‌ షాహిద్‌, సత్తార్‌ ఫైజీ, ఇఫ్తెఖార్‌ జమాల్‌, హాషిం తలీఖ్‌, తాబిష్‌ రబ్బానీలు పాల్గొంటారని చెప్పారు. హిందీ, తెలుగు కవులు పి. రజనీ, జి. సాంబశివరావు, బి. మాధవరావు, పి. మోహన్‌ రావు, ప్రసాద్‌, వి. వల్లభరావు, ఉమర్‌ ఫారూఖ్‌లు పాల్గొంటారు. త్రిభాష కవి సమ్మేళనంలో రాష్ట్ర ప్రగతి, సాహిత్య వైభవం, సంస్కృతిపై కవితలు వినిపించనున్నారని సత్తార్‌ ఫైజి తెలిపారు

కడప ఎడ్యుకేషన్‌: ఏపీ ప్రభుత్వ పరీక్షలకు సంబంధించి మే 1 నుంచి జూన్‌ 11వ తేదీ వరకు నిర్వహించబోయే 42 రోజుల టెక్నికల్‌ టీచర్స్‌ సర్టిఫికెట్‌(ప్రాక్టికల్స్‌) వేసవి శిక్షణా తరగతులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్‌ షంషుద్దీన్‌ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ శిక్షణా తరగతులను కడప చెమ్ముమియాపేట జిల్లా పరిషత్‌ బాలికలోన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు చెప్పారు. అభ్యర్థులకు మే 1 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలని తెలిపారు. గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు ఉండాలన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలని, సంబంధిత ట్రేడ్‌లో కనీస టెక్నికల్‌ అర్హత కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీలోపు రూ. 1000 ఫీజు చెల్లించాలని తెలిపారు. అభ్యర్థులు www.bse.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. డౌన్‌లోడ్‌ చేసిన దరఖాస్తు, విద్యార్హతల ఒరిజినల్‌, జిరాక్స్‌ సర్టిఫికెట్‌తో సహా డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని డీఈఓ ర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement