జిల్లాలో చురుగ్గా జనగణన | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో చురుగ్గా జనగణన

Apr 18 2026 8:35 AM | Updated on Apr 18 2026 8:35 AM

జిల్లాలో చురుగ్గా జనగణన

కడప సెవెన్‌రోడ్స్‌: భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న జనగణన కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ‘‘సెన్సెస్‌ సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌’’ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి స్వయంగా సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌లో తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి మాట్లాడుతూ ‘‘సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌’’ ప్రక్రియలో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కడప నగరపాలక సంస్థ కమిషనర్‌ రాకేష్‌ చంద్రం జనగణన ఎన్యుమరేషన్‌ కు సంబంధించి ఆన్‌ లైన్‌ నమోదు ప్రక్రియను తెలియజేశారు.

కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

Advertisement
 
Advertisement
Advertisement