ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం హుండీ ఆదాయం భారీగా పెరిగింది. గురువారం ఒంటిమిట్ట రామాలయంలోని రంగ మండపంలో టీటీడీ ఆలయ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, టీటీడీ విజిలెన్స్ అధికారుల పర్యవేక్షణలో శ్రీవారి సేవకులు హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఎన్నడు లేని విధంగా ఒంటిమిట్ట రామయ్యకు నెల రోజుల వ్యవధిలో రూ. 29,11,005లు వచ్చాయి.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: ప్రస్తుత వాహన్ పోర్టల్‌లో సీటింగ్, స్లీపర్ కెపాసిటీ కోసం వేర్వేరు వివరాలు అందుబాటులో ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహన యజమానులు తమ బస్సుల ఆర్సీలో అప్‌డేట్ చేసుకోవాలని జిల్లా ఉప రవాణాశాఖ ఇన్‌చార్జ్ కమినర్ వీర్రాజు పేర్కొన్నారు. గతంలో రవాణా శాఖకి చెందిన పాత సాఫ్ట్‌వేర్ (ఈ– ప్రగతి) లో సీటింగ్ కెపాసిటీ, స్లీపర్ కెపాసిటీ వేర్వేరుగా లేకపోవడం వల్ల సీటింగ్ కెపాసిటీ కింద రిజిస్ట్రేషన్ చేశామని పేర్కొన్నారు. గురువారం నగర శివార్లలోని ఊటుకూరులోని జిల్లా ఉప రవాణాశాఖ కమినర్ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఇప్పటికే పలు వాహన యజమానులు సబ్మిట్ చేసిన దరఖాస్తుల ఆధారంగా బస్సులు తనిఖీ చేసి, ఆర్సీలో వివరాలు అప్‌డేట్ చేశామని వివరించారు. ఈనెల 22 లోపల ఆర్సీలో అప్‌డేట్ చేసుకోవాలని కోరారు. లేకుంటే సీటింగ్, స్లీపర్ కెపాసిటీలు ఆర్సీలో లో ఒక విధంగా, బస్సులో ఒక విధంగా ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ప్లేస్మెంట్ డ్రైవ్‌లో ఏడుగురు విద్యార్థులు 6.5 లక్షలు వార్షికోత్స వంతో సాఫ్ట్వేర్ డెవలపర్స్‌గా ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థులను వీసీ బెల్లంకొండ రాజశేఖర్ అభినందించారు. హైదరాబాద్‌కు చెందిన ఎక్స్. ఎల్. ఆర్ ఎడ్యూ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్. అవినాశ్ , ప్రతినిధుల బృందం హాజరై విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేశారు. ప్లేస్ మెంట్ డ్రైవ్‌లో ఎంసీఏ, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు 64 మంది హాజరు కాగా ఏడుగురు ఎంపికయ్యారు. వారికి ఆ కంపెనీ ఆఫర్ లెటర్ ఇచ్చింది.


