సమగ్ర జనగణనకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

సమగ్ర జనగణనకు సర్వం సిద్ధం

Apr 16 2026 10:12 AM | Updated on Apr 16 2026 10:12 AM

కడప సెవెన్‌రోడ్స్‌: జన గణన–2027 కార్యక్రమాన్ని సమగ్రంగా నిర్వహించేందుకు జిల్లా లో అన్ని రకాల చర్యలు చేపట్టామని ప్రిన్సిపల్‌ సెన్సెస్‌ అధికారి శ్రీధర్‌ చెరుకూరి అన్నా రు. బుధవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. ప్రజలు ఖచ్చితమైన సమాచారాన్ని అందించి ఎన్యుమరేటర్లకు సహకరించాలని కోరారు. జనగణన రెండు దశల్లో జరుగుతుందన్నారు. మొదటి దశలో భాగంగా ఈనెల 16 నుంచి 30వ తేది వరకు స్వీయ గణన కార్యక్రమం నడుస్తుందన్నారు. మొదటిసారి పూర్తిగా డిజిటల్‌ ఫాంలో నమోదు జరగనుందన్నారు. ప్రజలు ఎన్యుమరేటర్ల కోసం ఎదురు చూడకుండా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని తమ వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. సెల్ప్‌ ఎన్యుమరేషన్‌ ద్వారా మే 1 నుంచి 30వ తేది వరకు ఇళ్ల గుర్తింపు, వివరాల సేకరణ నిర్వహిస్తామన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుంచి 28వ తేది వరకు నిజమైన జనాభా వివరాలను సేకరిస్తామన్నా రు. జనగణన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లా సెన్సెస్‌ నోడల్‌ అధికారి కిరణ్‌కుమార్‌ పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇచ్చారు.

‘జలధార’ను ప్రాధాన్యతతో నిర్వహించాలి

నీటి భద్రతా కార్యక్రమంలో రైతులు, సాగునీటి సంఘాల భాగస్వాములతో జలధార కార్యక్రమాలను ప్రాధాన్యతతో పటిష్టంగా చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి ఎంపీడీఓలను ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్‌లోని బోర్డు మీటింగ్‌ హాలు నుంచి ‘జలధార.. నీటి భద్రత–సాగు నీటి సంఘాల బాధ్యత’అమలు ప్రణాళిక, అమలుపై జేసీ డాక్టర్‌ నిధి మీనా, డీఎఫ్‌ఓ వినీత్‌ కుమార్‌ లతో కలిసి సంబంధిత అన్ని మండలాల ఎంపీడీఓలు, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు.

నేటి నుంచి స్వీయ గణన ప్రారంభం

మే 1 నుంచి ఇళ్ల జాబితా, గణన

జిల్లా ప్రిన్సిపల్‌ సెన్సెస్‌ అధికారిశ్రీధర్‌ చెరుకూరి

Advertisement
 
Advertisement
Advertisement