ఉచిత న్యాయ సహాయం వినియోగించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉచిత న్యాయ సహాయం వినియోగించుకోవాలి

Apr 16 2026 10:12 AM | Updated on Apr 16 2026 10:12 AM

కడప అర్బన్‌: కడప కేంద్ర కారాగారం, ప్రత్యేక మహిళా కారాగారాలలో ఏర్పాటు చేసిన ప్రిజన్‌ లీగల్‌ ఎయిడ్‌లను ఉచిత న్యాయసహాయం కోసం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.బాబా ఫకృద్దీన్‌ అన్నారు. తమ సిబ్బందితో కలిసి బుధవారం కడప పురుషుల కేంద్ర కారాగారం, ప్రత్యేక మహిళా కారాగారాలలోని ప్రిజన్‌ లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జైలు పరిసరాలను పరిశీలించి తగు సూచనలను సలహాలను ఇచ్చారు. లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ప్రాధాన్యతను తెలియజేశారు. లీగల్‌ఎయిడ్‌ బాక్సులను పరిశీలించారు. ఖైదీల ఆరోగ్య విషయాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సకాలంలో మందులను వాడాలని తెలియజేశారు. వైద్యాధికారికి తగు సూచనలు ఇచ్చారు. లీగల్‌ సర్వీసెస్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 15100 పై ప్రచారం నిర్వహించారు.

సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.బాబా ఫకృద్దీన్‌

Advertisement
 
Advertisement
Advertisement